మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి, వరి పంటల రైతులకు అండగా నిలవాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మంగళవారం నల్లగొండలో జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తడిసిన వరి ధాన్యం, పత్తిని ఎలాంటి షరతులు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్