జిల్లాలో శిశువిక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక దాడులు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో శనివారం ఆమె తన కార్యాలయంలో సంక్షేమ అధికారులు, ఆర్సిఓలతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి చెందిన సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటని ఆమె అభిప్రాయపడ్డారు.