తిరిగి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె తిప్పర్తి మండలం, చిన్న సూరారం గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. ధాన్యం కేంద్రాల నిర్వాహకులు, రైతులతో మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.