నిత్యం చోరీలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ దొంగను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక చోరీ కేసులో దొంగను పట్టుకోవడంతో, నల్లగొండను నేర రహిత జిల్లాగా మార్చేందుకు 'నేను సైతం-కమ్యూనిటీ సీసీటీవీ' ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. మంగళవారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.