హాస్పిటల్ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలి

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ సమస్యపై మంగళవారం నల్లగొండలో ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు మెమోరాండం అందజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ సత్యం, కలెక్టర్ తో మాట్లాడి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, వేతనాలు రాకపోయినా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్