పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం నల్గొండ జిల్లాలో ముస్లింల స్థితిగతులపై సమస్యలను శాసన మండలిలో ప్రశ్నిస్తానని అన్నారు. ఓపెన్ టాల్క్ విత్ మల్లన్న కార్యక్రమానికి హాజరైన ఆయన, ప్రముఖ న్యాయవాది మసిఉద్దిన్ ను కలిసి ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ మల్లన్న సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.