నల్గొండ మున్సిపాలిటీలో స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాపూజీ అదిలాబాద్ జిల్లాలో పుట్టి స్వతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పని చేశారని, మహానుభావుల జయంతి జరుపుకోవడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయపు కమిషనర్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.