స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీనవర్గాల సంక్షేమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని శనివారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ రమేష్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏ.ఓ శ్రీనివాస్, ఆర్.ఐ సంతోష్, సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.