మంత్రుల ఇండ్ల ముట్టడికి సిద్ధమవుదాం

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి, మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అమలు చేయడం లేదని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ వెంకన్న, చెవుగాని సీతారాములు ఆరోపించారు. నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో జరిగిన నాలుగో మహాసభలో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్