కులాంతర, మతాంతర వివాహితుల రక్షణ కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని, ఈ డిమాండ్‌తో నవంబర్ 9న హైదరాబాద్‌లో జాతీయ సమ్మేళనం నిర్వహించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వివాహితులపై దాడులు, బెదిరింపులు, హత్యలు పెరుగుతున్నాయని ఆయన స్థానిక కెవిపిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.