ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎంజియూ పిడిఎస్యు బృందం వినతి

నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని పట్టబద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పిడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను, ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే యూనివర్సిటీకి వందకోట్ల నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు హర్షవర్ధన్, మధు, సాయితేజ, సాయిగణేష్, సునీల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్