నల్గొండ జిల్లాలోని డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయిల కోసం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలల నిర్వహణ, అద్దెలు చెల్లించలేకపోతున్నామని, వెంటనే బకాయిపడిన ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు వచ్చే వరకు కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు పలికారు.