నల్గొండ: లాస్ట్‌ చాన్స్‌.. అప్లై చేసుకోండి

నల్గొండలోని ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సులలో చేరేందుకు చివరి అవకాశంగా ప్రత్యేక స్పాట్ అడ్మిషన్లను ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు డిగ్రీలో చేరని లోకల్ విద్యార్థులు ఈరోజు దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 18, 19 తేదీలలో లోకల్, నాన్-లోకల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నల్గొండ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. ఇది డిగ్రీ కోర్సులలో చేరేందుకు చివరి అవకాశం.

సంబంధిత పోస్ట్