నల్గొండ: రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

కొండమల్లేపల్లి పట్టణ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకొండ మండలం పెద్ద తండాకు చెందిన రామావత్ మధు  అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి 11:30 గంటల సమయంలో విధుల్లోంచి స్వగ్రామానికి వెళ్తుండగా, కోల్ ముంతల్ పహాడ్ గేటు పెట్రోల్ బంకు సమీపంలో అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో మధు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదుతో ఎస్ఐ అజ్మీర రమేష్ కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్