నిత్యం చోరీలు చేసే దొంగ పట్టివేత

నల్లగొండ వన్ టౌన్ పోలీసులు నిత్యం చోరీలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రుద్రాక్షి శ్రీను అనే దొంగను అరెస్ట్ చేశారు. గత నెల 25న పంచాయతీ కార్యదర్శి జెర్రిపోతుల రవి ఇంట్లో తాళం పగలగొట్టి బంగారం, నగదుతో పాటు ఓ బైకును దొంగిలించిన కేసులో అతన్ని పట్టుకున్నారు. దేవరకొండ రోడ్డులోని మరో ఇంట్లో కూడా దొంగతనం చేసినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. 'నేను సైతం-కమ్యూనిటీ సీసీటీవీ' కార్యక్రమాలతో నేరాలను అరికట్టడంలో ప్రజల అవగాహన ఫలించిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్