దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిన SFI నాయకులు

TG: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. గతంలో ఎన్ని సార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఎస్ఎఫ్ఐ చిట్యాల మండల కార్యదర్శి అరూరి ప్రణీత్ కుమార్ తెలిపారు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా స్పందించదో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలా తయారయ్యిందని ప్రణీత్ కుమార్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్