మండలంలోని ధర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని మహా చండి మాత అలంకరించి అర్చకులు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, ఈఓ అంబటి నాగిరెడ్డి, సిబ్బంది చంద్రయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్‌రెడ్డి, అర్చకులు నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమారాచార్యులు పాల్గొన్నారు.