మన ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 45 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్