జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు వృత్తి విద్య, సృజనాత్మకత అవసరమని అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలలు, 9, 10 తరగతుల విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తులపై శిక్షణ ఇవ్వడానికి సెట్విన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం రాంనగర్ లోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలలో విద్యార్థినిలకు వృత్తి విద్యపై అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.