ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

తిప్పర్తి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు, లారీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించినందుకు గాను కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి తిప్పర్తి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుఫాను కారణంగా గత రెండు, మూడు రోజులుగా వర్షం వల్ల కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది.

సంబంధిత పోస్ట్