నానో బనానా ట్రెండ్ ఇప్పుడు వాట్సాప్ బాట్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఫీచర్ ట్రెండ్‌గా మారుతున్న వేళ, ఏఐ కంపెనీ పర్‌ప్లెక్సిటీ కూడా ఇదే తరహా సదుపాయాన్ని ప్రారంభించింది. వినియోగదారులు ప్రత్యేక నంబర్ +1 (833) 436-3285 ద్వారా వాట్సాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసి, ప్రాంప్ట్ ఇచ్చి కావలసిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ మేరకు పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఈ ఫీచర్‌ను ప్రకటించారు.