ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో ఆయన చర్చిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని మోదీకి అందజేయనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో లోకేశ్ భేటీ అవుతారు. మే 17న కుటుంబంతో కలిసిన లోకేశ్.. నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ మోదీని కలవడం విశేషం.