పర్యాటక రంగంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం: కలెక్టర్

పర్యాటక రంగంలో నారాయణపేట జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని మూడ్ మల్ గ్రామం వద్ద గల బృహత్ శిలాయుగ నిలువు రాళ్ళ కట్టడములను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే అతి పెద్దవైన ఈ బృహత్ శిలాయుగ కట్టడాలు 3 వేల సంవత్సరాల పూర్వం నిర్మించబడ్డాయని, వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్