అనంత విశ్వంలో కొత్త గ్రహాన్ని గుర్తించిన నాసా

అంతరిక్ష పరిశోధనలో నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సౌర కుటుంబానికి బయట ఉన్న ఓ కొత్త గ్రహాన్ని స్వయంగా గుర్తించిన తొలి ఘటనగా ఇది నిలిచింది. శాస్త్రవేత్తలు దీనికి 'TWA 7b' అనే పేరు పెట్టారు. ఇది ఇప్పటివరకు ప్రత్యక్షంగా చిత్రీకరించిన గ్రహాల్లో అతి తక్కువ ద్రవ్యరాశి కలిగిన గ్రహంగా గుర్తింపు పొందింది. గురుగ్రహంతో పోల్చితే దీని బరువు కేవలం 0.3 రెట్లు మాత్రమే.

సంబంధిత పోస్ట్