శరన్నవరాత్రుల్లో దుర్గాదేవికి ఇష్టమైన పువ్వులు సమర్పించడం వల్ల భక్తులకు అదృష్టం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మొదటి రోజు శైలపుత్రికి తెల్లటి కమలం, 2వ రోజు బ్రహ్మచారిణికి గులాబీలు, మల్లెపూలు, 3వ రోజు చంద్రఘంటకు బంతి పువ్వులు, 4వ రోజు కూష్మాండ దేవికి ఎర్ర మందార, 5వ రోజు స్కందమాతకు కమలం, 6వ రోజు కాత్యాయనీకి కదంబ పువ్వు, 7వ రోజు కాళరాత్రికి మందార పువ్వులు, 8వ రోజు మహాగౌరికి తెల్లని మల్లెలు, 9వ రోజు సిద్ధిదాత్రికి నీలి కమలం సమర్పిస్తారు.