ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌‎లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్ లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్ ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించారు. పోలాండ్ అథ్లెట్ డేవిడ్ వెంగెర్ మూడో ప్రయత్నంలో 85.67 మీటర్లు విసిరి ఫైనల్ కు అర్హత సాధించారు. రేపు(గురువారం) ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్