నేపాల్‌లో ఆర్మీ చేతుల్లోకి పాలన

నేపాల్‌లో పరిస్థితి అదుపులోకి తేవడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి శాంతిభద్రతలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. దేశంలో హై అలర్ట్ విధించారు. ఆందోళనల పేరుతో కొందరు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, నేరాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ప్రజలు అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్