భారతదేశం హై టెక్నాలజీతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని ప్రారంభించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ పాస్‌పోర్ట్, 1 ఏప్రిల్ 2024న పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలైంది. ఇందులో RFID చిప్, యాంటెన్నా ఉంటాయి. ఫింగర్ ప్రింట్, డిజిటల్ ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలతో పాటు వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది. ICAO నియమాలకు అనుగుణంగా రూపొందించిన ఈ పాస్‌పోర్ట్‌తో నకిలీలను అరికట్టడం సులభతరం అవుతుంది. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.