జియో హాట్‌స్టార్‌లో రియా పేరుతో కొత్త ఏఐ అసిస్టెంట్‌ను జోడిస్తున్నట్లు ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ఇది కంటెంట్‌ను వెతకడానికి తోడ్పడుతుందని.. యూజర్లు కావాల్సిన ఎపిసోడ్స్‌ను స్క్రోల్ చేయకుండా వాయిస్ కమాండ్స్‌తో సెర్చ్ చేయొచ్చని అన్నారు. దీంతో పాటు వాయిస్ ప్రింట్ అనే మరో ఏఐ టూల్, మ్యాక్స్‌వ్యూ 3.0ను కూడా జోడిస్తున్నట్లు తెలిపారు. వాయిస్ క్లోనింగ్, లిప్‌సింక్ టెక్నాలజీ ద్వారా నచ్చిన భారతీయ భాషలో నటులు, ప్లేయర్ల మాటలు వినొచ్చన్నారు.