AP: ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును బకెట్‌లో పెట్టి బాలింత వెళ్లిపోయింది. ప్రసవం కోసం సోమవారం రాత్రి ఓ గర్భిణీ గిద్దలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలోని వాష్‌రూమ్ వద్ద ఆమెకు ప్రసవం అయింది. అయితే శిశువును బకెట్‌లో వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత శిశువు ఏడుపు వినిపించడంతో ఆస్పత్రి సిబ్బంది అక్కడికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.