పిల్లర్ బాక్స్ కూలి మహిళ మృతి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామంలో ఇండిరమ్మ ఇంటి నిర్మాణంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లర్‌కు అమర్చిన ఇనుప పెట్టె కూలిపోవడంతో ఇంటి యజమానురాలు సుగుణ (45) అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లర్ పనుల సమయంలో మేస్త్రి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్