కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా శనివారం జన్నారం బిసి సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని బీసీ యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్