బాసర అమ్మవారి కాళరాత్రి అవతారం: భక్తుల రద్దీ

నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడవ రోజు కాళరాత్రి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున మహాహారతి, నివేదన, ప్రత్యేక పూజల అనంతరం కూరగాయలతో చేసిన ఖిచిడీని నైవేద్యంగా సమర్పించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీ దేవీ, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్