కార్తీక పౌర్ణమి సందర్భంగా బాసర గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతిమంతంగా మారింది. బుధవారం రాత్రి నిర్వహించిన గంగా హారతి, జ్వాలాతోరణం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. వేద పండితులు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. గోదావరి తీరమంతా దీపాల కాంతులతో నిండిపోగా, భక్తుల భజనలు, హారతుల నినాదాలతో బాసర పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో మునిగిపోయింది.