బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం ఖాయం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం ఖాయమని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం బోరుబండలో ప్రచారం నిర్వహించిన ఆయన, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన బూటకపు హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పదేళ్లు బీఆర్ఎస్, రెండేళ్లుగా కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు ఇక ఆ పార్టీలను నమ్మే స్థితిలో లేరని, ప్రత్యామ్నాయంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్