తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సా గౌడ్ ఆదివారం మాట్లాడుతూ, కల్లు గీత వృత్తి రక్షణకు, గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకు దెబ్బ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాలలో వీడీసీల పేరుతో కల్లుగీత కార్మికులను వేధిస్తూ దోపిడీ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు గౌడ సంఘాల పదాధికారులు, సభ్యులు పాల్గొన్నారు.