సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

సోన్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అటక్ లాలాబాయి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన చికిత్స నిమిత్తం రూ. 2.75 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కును మంగళవారం కుటుంబ సభ్యులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు. ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్