వైభవంగా కొనసాగుతున్న పునః ప్రతిష్టాపన వేడుకలు

సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ ఆలయ పునః ప్రతిష్టాపన వేడుకలు బుధవారం మూడవరోజు వైభవంగా కొనసాగాయి. వేదపండితుల ఆధ్వర్యంలో మంత్రోత్సవాలు, చండీపారాయణ, చండీ హోమం, విగ్రహాల ఫల పుష్పాదివాసము వంటి కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్