శుక్రవారం ఉదయం కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్, సిర్పూర్ టి మధ్య గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నుండి ప్రమాదవశాత్తు చందన్ కుమార్ (18) కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతని తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గోరఖ్‌పూర్ నుండి త్రిపూర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.