ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో, తాళ్ల రాంపూర్ గ్రామంలో యువతను డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు 'కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం'లో భాగంగా రెండు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 టీంలు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమంలో సీపీ పి. సాయి చైతన్య పాల్గొని యువతకు దిశా నిర్దేశం చేశారు.