ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన 36 ఏళ్ల స్వప్న అనే మహిళ, తన భర్త రాములుతో జరిగిన చిన్న గొడవ కారణంగా తన చిన్న పాపతో కలిసి శనివారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లి అప్పటి నుంచి తిరిగి రాలేదు. వారి ఆచూకీ లభించకపోవడంతో భర్త రాములు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఫోటోలో కనిపిస్తున్న స్వప్న, ఆమె పాప ఎవరికైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.