నేడే జాతర ట్రాఫిక్కు ప్రణాళిక.. పటిష్ఠ బందోబస్తు..

కార్తీక మాసంలో లింబాద్రి గుట్టపై జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు రథ భ్రమణోత్సవం (జాతర) అంగరంగ వైభవంగా జరగనుంది. లక్ష్మీనర్సింహస్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లి, వేదమంత్రాల మధ్య శక్తి హోమం, పుర్ణాహుతి, బలి ప్రదానం వంటి కార్యక్రమాలు చేపట్టి, అనంతరం శాస్త్రవిధిగా రథ భ్రమణం చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు నివారించడానికి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ముగ్గురు ఏసీపీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 350 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్