గుర్తు తెలియని మృతదేహం లభ్యం

వేల్పూర్ మండలం పడిగెల గ్రామంలోని బైపాస్ రోడ్డుపై సోమవారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సుమారు 35 ఏళ్ల వయసున్న మృతుడు టీషర్టు, జీన్ప్యాంట్ ధరించి ఉన్నాడు. గ్రామస్థులు మురికి కాలువలో పడి ఉన్న వ్యక్తిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి మేస్త్రీ వద్ద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్