భార్యాభర్తల గొడవలో భార్య హత్య.. భర్త అరెస్ట్

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడక్‌పల్లిలో శనివారం భార్యాభర్తల గొడవలో భార్య బానోత్ సరోజ (46) కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త బానోత్ రాజు (48)ను పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ దంపతులు గత ఆరు నెలలుగా బీరంగూడలో నివసిస్తూ కూలీ పని చేసుకుంటున్నారు. గతంలో భర్త భార్యను వేధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రభాకర్, సీ నరేశ్ వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్