మంగళవారం నవీపేట పోలీస్ స్టేషన్లో అఫ్రోజ్ ఖాన్ అనే వ్యక్తి తన బ్లేడ్ ట్రాక్టర్ చోరీకి గురైందని ఫిర్యాదు చేశారు. గత నెల 18న నవీపేటలోని పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ను నిలిపి ఉంచగా, 22న వచ్చి చూసేసరికి అది కనిపించలేదని బాధితుడు తెలిపారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.