వరి ధాన్యం లారీని పట్టుకొని వదిలేసిన అధికారులు – ప్రజల్లో ఆగ్రహం

తెలంగాణలోని సాలూర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరి ధాన్యం లారీని అధికారులు అక్టోబర్ 31, శుక్రవారం నాడు పట్టుకున్నారు. దాదాపు 320 క్వింటాల ధాన్యం ఉన్న ఈ లారీని అధికారులు కేసు నమోదు చేయకుండానే వెనక్కి పంపించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో, అక్రమంగా వస్తున్న లారీని పట్టుకొని వదిలేయడం చట్టబద్ధమేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఇలాంటి లారీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ధాన్యం రవాణాను అరికట్టాలంటే, యజమానులపై, వాహనాలపై కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్