ధాన్యం అక్రమ రవాణాపై కఠిన నిఘా: అధికారులు హెచ్చరిక

తెలంగాణ సరిహద్దుల్లో ధాన్యం అక్రమ రవాణాపై అధికారులు కఠిన నిఘా అమలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు జరిపి, మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి వడ్ల ధాన్యంతో వస్తున్న లారీని అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వడ్ల ధాన్యం రవాణా పూర్తిగా నిషేధించబడిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ రైతుల నుండి మద్దతు ధర వద్ద కొనుగోలు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని తెలిపారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరిక జారీ చేశారు.

సంబంధిత పోస్ట్