మహిళ అదృశ్యం.. కేసు నమోదు

ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన అనపర్తి రజిత అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై రమ తెలిపారు. 8 ఏళ్ల క్రితం సిద్దిపేట కాలువ నాగరాజుతో వివాహమైన రజితకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులు కామారెడ్డిలో నివసించిన ఆమె, 6 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రజిత ఆచూకీ బంధువుల వద్ద కూడా లభించలేదు. మంగళవారం సాయంత్రం రజిత తల్లి అనపర్తి కుమారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్