గుర్తుతెలియని వాహనం ఢీ.. యువకుడు మృతి

ఆదివారం రాత్రి మహారాష్ట్రలోని రోహిని గ్రామానికి చెందిన కైరోద్దీన్ (17) అనే యువకుడు సాలూర క్యాంప్ శివారులో గుర్తుతెలియని డీసీఎం వాహనం ఢీకొని మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి తెలిపారు. కైరోద్దీన్, సమీర్, శంభు ఖాజాపూర్ వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై పడిన కైరోద్దీన్ కాళ్లపై నుంచి డీసీఎం వాహనం వెళ్లిపోయింది. పోలీసులు సమాచారం అందుకుని, చికిత్స కోసం బోధన్ ఆసుపత్రికి తరలించగా, ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం సంఘటన స్థలం నుంచి పారిపోయింది. మృతుడి తల్లి తస్లీమాబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్