కామారెడ్డిలో దొంగతనం

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి సిద్ధి వినాయకనగర్ కాలనీలో సోమవారం రాత్రి చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చే సరికి మంగళవారం ఇంట్లో అంతా చెల్లాచెదురుగా పడి ఉందని తెలిపారు. దొంగలు 6.5 తులాల బంగారం, 1.75 కిలోల వెండి, లక్షన్నర నగదు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీం, సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్